'అ...ఆ' వల్ల లాభపడింది ఎవరు!
Advertisement
CJ Advs
:
మొదటి నుండి 'అ..ఆ'చిత్రంలో నితిన్‌ కంటే సమంతకే ఎక్కువ ప్రాదాన్యం ఉంటుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ చూసిన తర్వాత అది నిజమే అనిపించింది. చిత్రం విడుదలైన తర్వాత ఈ చిత్రంలో డామినేషన్‌ అంతా సమంతదే అని ఫైనల్‌ అయింది. ఈ చిత్రం నితిన్‌కు పెద్దగా ప్లస్‌ కాలేకపోయింది. కేవలం త్రివిక్రమ్‌తో చేయడం, తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా నిలవడం, తన గత చిత్రాల కంటే ఈ చిత్రంలో నితిన్‌ సెటిల్డ్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడనే టాక్‌ రావడం, నితిన్‌ కెరీర్‌లోనే అతి పెద్ద హిట్‌గా నిలవడం మినహా ఈచిత్రం నితిన్‌కు ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదనే చెప్పవచ్చు. ఈ చిత్రం వల్ల డైరెక్టర్‌ త్రివిక్రమ్‌కు, కీలకపాత్ర పోషించిన సమంతకు ఎక్కువగా క్రెడిట్‌ వెళ్తోంది. మొత్తానికి నితిన్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు అనే అంశాన్ని ఈ చిత్రం ప్రూవ్‌ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి మరికొన్ని చిత్రాలు చేయడం ద్వారా నితిన్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యే అవకాశాన్ని మాత్రం ఈ చిత్రం కల్పించింది. కాగా మొదట్లో ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో అంటే 20 నుంచి 25కోట్ల లోపు పూర్తి చేయాలని త్రివిక్రమ్‌తోపాటు నిర్మాత రాధాకృష్ణ భావించాడు. కానీ ఈ చిత్రం పూర్తయ్యే సరికి దాదాపు 35కోట్లు దాటింది. అనుకున్న షెడ్యూల్‌ కంటే షూటింగ్‌కు ఎక్కువ సమయం తీసుకోవడం, వర్కింగ్‌ డేస్‌ పెరిగిపోవడం, మధ్యలో టెక్నీషియన్స్‌ను మార్చడం వంటి కారణాల వల్ల బడ్జెట్‌ భారీగా పెరగడంతో ఈచిత్రం నిర్మాత రాధాకృష్ణకు కూడా పెద్దగా ఏమీ మిగల్చలేదని తెలుస్తోంది.
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads