'ఈరోజుల్లో, బస్టాప్' వంటి చిత్రాలతో బూతు ముద్రను వేయించుకున్న దర్శకుడు మారుతి... 'కొత్తజంట'తో కాస్త తన రూట్‌ను మార్చి నానితో చేసిన 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో క్లీన్ ఎంటర్‌టైనర్‌తో బ్లాక్‌బస్టర్‌తో ఆ ముద్రని చెరిపేసుకున్నాడు. ఈ చిత్రంతో నాని తలరాత కూడా మారిపోయి ఓవర్‌నైట్‌లో నాచురల్‌స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత మారుతి వెంకటేష్, నయనతారలతో 'బాబూ బంగారం' చిత్రంతో బిజీ కాగా, మరోవైపు నాని 'జంటిల్‌మేన్'తో పాటు పలు చిత్రాల్లో బిజీ అయిపోయాడు. అయితే ప్రస్తుతం మారుతి 'భలే భలే మగాడివోయ్' చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొదటి భాగం కంటే కామెడీ డోస్‌ను మరింత పెంచి, మొదటి భాగంలో టచ్ చేయని యాక్షన్‌కు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, ప్రస్తుతం నానికి ఉన్న ఇమేజ్‌ను, క్రేజ్‌కు తగ్గట్లుగా 'భలే భలే మగాడివోయ్' సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాడట మారుతి. మరి ఇప్పటివరకు సీక్వెల్స్ హిట్ అయిన దాఖలాలు లేని టాలీవుడ్‌లో మారుతి తన సీక్వెల్‌ను కూడా విజయవంతం చేసి నూతన చరిత్రను తిరిగిరాస్తాడో లేదో వేచిచూడాల్సివుంది....!