కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తన కుమారుడైన రాహుల్‌గాంధీని పార్టీ ఉపాధ్యక్షుని చేసింది. కానీ దానివల్ల కాంగ్రెస్‌కు ఒరిగింది ఏమీ లేదు. గత ఎన్నికల్లో మోడీ హవా ముందు రాహుల్ తేలిపోయాడు. అయినా సరే తన తర్వాత రాహల్‌గాంధీకి అధ్యక్షపగ్గాలు అప్పగించాలని సోనియా సిద్దమవుతోంది. వచ్చే యుపి ఎన్నికల నాటికి రాహుల్‌ను అధ్యక్షుడిని చేసి ప్రియాంకా వదేరాను యూపి ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి దేశంలో దీనంగా ఉంది. ఎవరో ఒకరు ముందుకు వచ్చి అద్భుతాలు చేయందే కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని అంటున్నారు. కానీ నాయకత్వ లక్షణాలు ఏమీ లేని రాహుల్‌గాంధీని భవిష్యత్తు ప్రధానిగా ప్రకటిస్తే మోడీ హవా ముందు రాహల్ తట్టుకునే పరిస్ధితి కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌లకు పూర్తి మెజార్టీ రానిపక్షంలో ప్రాంతీయపార్టీలతో కలిసి యూపీఏను నడిపించే సత్తా రాహుల్‌కు లేదని వారి పార్టీ సీనియర్లే అంటున్నారు. మరి కాంగ్రెస్ అధినేత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సివుంది.