Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కోసం క్యూ కట్టారు!


ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. అయితే అక్కడ ఎన్టీఆర్ దెబ్బకి ట్రాఫిక్ జామ్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళంలో కూడా మంచి క్రేజ్ ఉందనే విషయాన్ని ఓ సంఘటన రుజువు చేస్తోంది. ఎన్టీఆర్ సినిమా చెన్నైలో పలానా ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటుందని తెలుసుకున్న అక్కడ అభిమానులు ఆయనను వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఎన్టీఆర్ కోసం వారంతా క్యూ లో నుంచోవడం వారందరికీ ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి తారక్ క్రేజ్ అక్కడ కూడా ఓ రేంజ్ లో ఉందని అర్ధమవుతోంది. ఈ సినిమాలో తారక్ కు జోడీగా సమంత, నిత్యా మీనన్ లు నటిస్తున్నారు. ఆగస్ట్ 12న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs