తన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా జగపతిబాబు అదరగొడుతున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్స్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. త్వరలో ఆయన విజయ్, విశాల్ వంటి హీరోల చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక తెలుగులోకి వస్తే 'మిర్చి, బాహుబలి' చిత్రాలతో సత్యరాజ్ తెలుగులో ఇప్పుడు బిజీ బిజీగా మారిపోయాడు. వీరే కాదు.. మోహన్‌లాల్ వంటి మలయాళ సూపర్‌స్టార్స్ కూడా తమిళం, తెలుగులో తమ సత్తా చాటడానికి ముందుకు వస్తున్నారు. ఇలా మన నటులు పరభాషల్లో, పరభాషా నటులు మన చిత్రాల్లో నటిస్తూ చిత్రాలకు నిండుదనం తెస్తున్నారు. దీనివల్ల సినిమాల మార్కెట్ పరిధి కూడా విస్తరిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.