సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ వారసులను, బంధువులను హీరోలుగా పరిచయం చేస్తుంటారు. అయితే సుకుమార్ కూడా తన అన్న కొడుకు అశోక్ ని హీరోగా పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ పేరుతో ఇప్పటికే సుక్కు ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఇప్పుడు తన తండ్రి బండ్రెడ్డి పేరుతో బిటిఆర్ క్రియేషన్స్ అనే మరో కొత్త బ్యానర్ ను స్థాపించబోతున్నాడు. ఈ బ్యానర్ లో మొదటి సినిమాను తన అన్న కొడుకు హీరోగా తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు హరిప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు. అశోక్ ఇది వరకు కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. తను హీరోగా ఇదివరకే పరిచయం కావాల్సింది కాని కుదరలేదు. దీంతో సుకుమారే స్వయంగా తన బ్యానర్ లో ఇంట్రడ్యూస్ చేయనున్నారు. జూన్ 9 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని సమాచారం. ఈ సినిమాలో అశోక్ కు జంటగా ఈషా నటించనుంది. ఈ చిత్రానికి 'దర్శకుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.