Advertisement
Google Ads BL

ఈ ఏడాదిలో ఇప్పటివరకు టాప్‌ 10 చిత్రాలు!


గత ఏడాది టాలీవుడ్‌కి 'బాహుబలి, శ్రీమంతుడు' చిత్రాలు పెద్ద విజయం సాధించాయి. కానీ ఈ ఏడాది ప్రారంభమై ఐదునెలలు దాటిపోయినా కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీకి పెద్ద హిట్‌ అయితే మాత్రం రాలేదు. పవన్‌ నటించిన 'సర్దార్‌', మహేష్‌ నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. కాగా ఈ ఐదునెలలో ఎంతో కొంత లాభాలను సంపాదించి బయ్యర్లను, నిర్మాతలను సంతోషపెట్టిన టాప్‌ 10 చిత్రాలను చూస్తే, 'సరైనోడు, సోగ్గాడే చిన్నినాయనా, జంగిల్‌ బుక్‌, నేను శైలజ, ఎక్స్‌ప్రెస్‌రాజా, నాన్నకు ప్రేమతో, ఊపిరి, క్షణం, సుప్రీమ్‌, బిచ్చగాడు'లను చెప్పుకోవాలి. మొత్తానికి ఈ ఏడాది సంక్రాంతి అందరినీ సంతోషపెట్టినప్పటికీ సమ్మర్‌ సీజన్‌ను మాత్రం ఏ సినిమా సరిగ్గా క్యాష్‌ చేసుకోలేకపోయంది. సమ్మర్‌కు వచ్చిన చిత్రాలలో కేవలం 'సరైనోడు' మాత్రమే సమ్మర్‌ సీజన్‌ను క్యాష్‌ చేసుకొని, అనూహ్యంగా లాభాలను సంపాదించింది. దీనికి పోటీగా మరే సినిమాలు లేకపోవడం, 'బ్రహ్మోత్సవం' చిత్రం 'సరైనోడు'కి బ్రేక్‌ వేస్తుందని భావిస్తే ఆ చిత్రం కూడా డిజాస్టర్‌ కావడం 'సరైనోడు'కి ప్లస్‌ పాయింట్స్‌కు చెప్పుకోవచ్చు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs