'ఏ మాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యూత్ లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న నటి సమంత. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. అందరితో చాలా సరదాగా అల్లరి చేస్తూ.. మాట్లాడే సామ్ కు ఇండస్ట్రీలో చాలా మంచి స్నేహితులు ఉన్నారు. గతంలో ఈ అమ్మడు ఓ స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ నడుపుతుందనే మాటలు వినిపించాయి. కాని వీటిపై సమంత పెద్దగా స్పందించలేదు. తాజాగా తన తోటి హీరోతో ప్రేమాయణం నడిపిస్తుందని, పెళ్లి కూడా చేసుకోబోతోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో 'నేను ఇండస్ట్రీలో ఉండే అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని' చెప్పిందీ అమ్మడు. మరోసారి ఈ విషయమై సమంతకు మీడియా నుండి ప్రశ్న ఎదురైంది. వెంటనే సమంత మాట దాటేసి నాకు మీడియా అంటే పెద్దగా నచ్చదు.. వరుస సినిమాలు చేయడం వలన ఎక్కువగా మీడియాలో ఉండాల్సి వస్తోంది. 'జనతా గ్యారేజ్' తరువాత తెలుగులో సినిమాలు ఒప్పుకోలేదు. కొన్నిరోజులకు మీడియాకు దూరంగా సంతోషంగా ఉండొచ్చని సెలవిచ్చింది.