అధికారం చేతుల్లో ఉంటే ఏదైనా చేయవచ్చు. ఎలాగైన ప్రవర్తించవచ్చు. మరో రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రావతరణ దినోత్సవాన్ని, ప్రభుత్వ రెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. మంత్రులు, అధికారులు ఉరుకుల, పరుగుల మీద పనిచేస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చక్రం తిప్పుతున్నారు. అయితే ఆయన వారసులు కేటీఆర్ అమెరికా టూర్ కు, కవిత ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో ఉండి పర్యవేక్షించాల్సిన వారసులు విదేశీ పర్యటన చేస్తున్నారు. కేటీఆర్ తన అప్ డేట్స్ మీడియాకు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఒక రాష్ట్ర మంత్రి విదేశాలతో ఒప్పందాలు చేసుకోవచ్చా, నిర్ణయాలు ప్రకటించవచ్చా అనేది కేటీఆర్ తేల్చిచెప్పాలి. ఎందుకంటే ఆయన అమెరికాలో అక్కడి పారిశ్రామికవేత్తలకు అనేక హామీలు గుప్పిస్తున్నారు. రాష్ట్రావతరణ ఏర్పాట్లు తమపై వేసినందుకు కొందరు మంత్రులు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. క్రెడిట్ దక్కే ఎన్నికల్లో మాత్రం కేటీఆర్ కు బాధ్యతలు ఇచ్చి, దీనికి మాత్రం తప్పించడం పట్ల మంత్రులు కినుక వహిస్తున్నారు. కవిత తన నియోజకవర్గం నిజామాబాద్ గురించి ఎప్పుడో మరిచిపోయిందనే విమర్శలున్నాయి. కేసీఆర్ కూడా నిజాామాబాద్ పై ఎక్కువ దృష్టిసారించడం లేదు. బిజెపీతో వియ్యం కుదిరితే కవితను మంత్రిని చేసే ఆలోచనతో ఉన్నారు. పార్లమెంట్ కమిటీల తరుపున విదేశాలకు వెళుతున్న ప్రతి కమిటీలో కవిత ఉండడం అందులో భాగమే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.