Advertisement
Google Ads BL

చిరు స్కెచ్‌ అదిరింది....!


చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రానికి సంబంధించిన ప్రీపోడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రం తమిళ కత్తి కి రీమేక్‌గా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చిరు సరసన అనుష్క నటించనుండగా, ఓ కీలకపాత్రతో పాటు ఓ సాంగ్‌లో కేథరిన్‌ కనిపించనుంది. ఈచిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్న వివి వినాయక్‌ తమిళ కత్తి స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేస్తున్నాడు. నాయకుడి క్యారెక్టర్‌కు పెద్దగా మార్పులు చేయకపోయినా, దొంగ పాత్రకు మాత్రం పలు మార్పులు చేసినట్లు, ఈ పాత్ర ద్వారా ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించనున్నారు. వాస్తవానికి కత్తి ఒరిజినల్‌లో స్పెషల్‌సాంగ్‌ లేదు. అలాగే సినిమా మొత్తం డ్రైగా, సీరియస్‌ సాగుతుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ జూన్‌ 6 నుండి మొదలుకానుంది. ఇంత పక్కా క్లారిఫికేషన్‌ ఉన్నప్పటికీ ఈ చిత్రం విషయంలో అభిమానులను ఓ టెన్షన్‌ వెంటాడుతోంది. ఈ చిత్రం కథ తనదే అని నరసింహారావు అనే రచయిత రైటర్స్‌ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం తేలేదాకా ఈ చిత్ర షూటింగ్‌కు 24క్రాఫ్ట్‌లోని ఎవ్వరూ పనిచేయకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కథను వాడుకున్నందుకు గాను మూడు కోట్లను నరసింహారావు డిమాండ్‌ చేస్తున్నాడు. మొత్తానికి తాజాగా ఈచిత్రానికి ఆ టెన్షన్‌ కూడా తొలగిపోయింది. ఏకంగా మూడు కోట్లు ఆ రచయితకు ఇవ్వడానికి చిరు ఒప్పుకోలేదు. అందులోనూ ఈ చిత్రాన్ని తన తనయుడు రామ్‌చరణ్‌ నిర్మిస్తుండటంతో అతని చేత అంత పెద్ద మొత్తం ఇప్పించడానికి చిరు సిద్దపడలేదు. ఎట్టకేలకు ఈ చిత్రం నిర్మాణంలో పాలుపంచుకోన్న లైకా ప్రొడక్షన్స్‌ అధినేతల చేత చిరు, వినాయక్‌లు కలిసి నరసింహారావుకు రెండు కోట్లు పరిహారం ఇప్పించారని సమాచారం. తమిళ్‌లో కూడా ఈ చిత్రాన్ని నిర్మించింది లైకా ప్రొడక్షన్స్‌ సంస్ధేకావడంతో చిరు మాటను కాదనలేక ఆ మొత్తాన్ని వారే చెల్లించారని సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs