జగన్ అక్రమాస్తుల కేసులో అన్ని చార్జిషీట్లలోనూ జగన్ ఎ1 ముద్దాయి అయితే ఆ తర్వాత స్దానంలో విజయసాయిరెడ్డి ఉన్నాడు. ఆయన వైఎస్ కుటుంబానికి చాలా సన్నిహితుడు. దీంతో జగన్... విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటును ఇచ్చాడు. పలువురు సీనియర్లను కాదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇందుకు జగన్ రాజకీయ కారణాలు చెప్పకుండా విజయసాయిరెడ్డికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడాడు. ఆయన చేతిలో తన గుట్టు మొత్తం ఉందనే భయంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. జగన్ చెప్పినట్లు ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా విజయ్‌సాయిరెడ్డి నిలిచాడంటే అప్రూవర్‌గా మారకపోవడమేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా ఆయన పార్టీకి ఏమి సేవచేశాడు? అనే విషమాన్ని చెప్పకుండా తన వ్యక్తిగత జీవితంలో అండగా నిలిచాడు కాబట్టి రాజ్యసభ సీటు ఇస్తున్నానని చెప్పుకోవడం రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా కొందరు పోలుస్తున్నారు. సిబిఐ అధికారులు ఎంత ఒత్తిడి చేసినా జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా ఉన్నందునే ఆయనకు పార్టీలో ఉన్నత పదవి కట్టబెట్టారన్నమాట...! ఈ విషయంలో టిడిపి విమర్శలు చేయడానికి జగన్ తానే స్వయంగా ఆయుధాన్ని ఇచ్చినట్లు అయింది.