Advertisement

బిజెపి కి సర్వేల సపోర్ట్..!


బిజెపి పార్టీ దక్షిణాదిలో పట్టు పెంచుకుంటోంది. అందుకు తగ్గ వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఆ పార్టీకి 2014లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ శాతం ఓట్లు వస్తాయట. ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. దేశ ప్రసిద్దమైన ఓ సర్వే సంస్థ అందిస్తున్న పక్కా సమాచారం ఇది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ, కర్ణాటకలో ఎన్డీయే కూటమి 50 ఎంపీ సీట్లను, 35శాతం ఓట్లను సంపాదించుకుంటుందట. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీయే కూటమికి 342 సీట్లు, యూపీఏకు కేవలం 66 స్ధానాలు మాత్రమే వస్తాయని ఆ సర్వే స్పష్టం చేసింది. లెఫ్ట్‌ పార్టీలు14 స్ధానాలను మాత్రమే దక్కించుకోనున్నాయి. ఇక దేశ ప్రధానుల విషయంలో మోడీకి మొదటి స్దానం,ఇందిరాగాంధీ, వాజ్‌పేయ్‌కు రెండు మూడు స్ధానాలు పొందారని ఆ సర్వే తేల్చింది. మోడీ చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపై మెజార్టీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటున్నారు. మరి ఈ సర్వే బిజెపిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement