Advertisement
Google Ads BL

పవన్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్లే..!


'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో అందరినీ నిరాశపరిచిన పవన్‌కళ్యాణ్‌ మరోసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదనే పట్టుదలతో ఉన్నాడు. తాజాగా ఆయన శరత్‌మరార్‌ నిర్మాతగా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో తనకు 'ఖుషీ'వంటి మరో పెద్ద హిట్‌ను సూర్య తనకి ఇస్తాడనే నమ్మకంతో ఆయన ఉన్నారు. అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించే సూర్యకు అవకాశం ఇచ్చాడని సమాచారం. ఇక ఈ చిత్రం పూర్తయిన తర్వాత సెప్టెంబర్‌ నుండి ఆయన దాసరి నారాయణరావు నిర్మాతగా రూపొందే చిత్రానికి బల్క్‌డేట్స్‌ ఇచ్చాడు. తనకు 'జల్సా, అత్తారింటికి దారేది' వంటి సూపర్‌హిట్స్‌ను ఇచ్చిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడని విశ్వసనీయ సమాచారం. మొదట్లో త్రివిక్రమ్‌, తమిళ స్టార్‌ సూర్యల కాంబినేషన్‌లో ఓ చిత్రం ఉంటుందని భావించినప్పటికీ ఆ ప్రాజెక్ట్‌ వాయిదా పడింది. దీంతో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పవన్‌ల కాంబినేషన్‌ సెట్‌ అయింది. దాసరి చిత్రం తర్వాత సినిమాను.. పవన్‌ నిర్మాత ఎ.యం.రత్నంకు చేయనున్నాడు. తమిళ 'వేదాలం'కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందనుంది. తనతో 'దబాంగ్‌' రీమేక్‌గా వచ్చిన 'గబ్బర్‌సింగ్‌'తో పెద్ద హిట్‌ ఇచ్చిన హరీష్‌శంకర్‌కే తాజా రీమేక్‌ను కూడా అప్పగించాడని సమాచారం. ఈ చిత్రంతో హరీష్‌ మరోసారి తన క్రియేటివిటీ ని చూపించడం ఖాయం అంటున్నారు పవన్‌ అభిమానులు. మొత్తానికి పవన్‌ చేయబోయే తదుపరి మూడు చిత్రాలపై ఓ క్లారిటీ వచ్చేసినట్లే! ఇప్పటి వరకు పవన్ సినీ కెరియర్ లోనే లేని విధంగా పవన్ ఒకేసారి చేయబోయే 3 చిత్రాల గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వడం తో మెగా ఫ్యాన్స్ యమా హ్యాపీ గా వున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs