త్రివిక్రమ్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'అఆ'. ఈ సినిమా జూన్ 2 వ తేదిన విడుదలకు సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా తీసే పద్దతి ఆయన రాసే డైలాగ్స్ ఆడియన్స్ కు తొందరగా కనెక్ట్ అవుతాయి. అంతే కాకుండా ఆయన రాసే మాటలు మనసుకు చాలా దగ్గరగా వుంటాయి. మాటలతో త్రివిక్రమ్ ఇచ్చే పంచులు, ప్రాసలు కోసం ఫ్యాన్సే వున్నారంటే..అతిశయోక్తి లేదు. నితిన్, సమంతా కాంబినేషన్ కూడా చాలా బావుంటుందని..ఈ సినిమా అన్ని రకాల ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చుతుందని త్రివిక్రమ్ చెబుతున్నాడు అంటే ప్రేక్షకుల్ని మరో 'అత్తారింటికి..' తీసుకెళ్లడం గ్యారంటి. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ వాళ్ళు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్తైన్మెంట్ అన్నమాట . ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టడానికి 'అఆ'.. టీం సన్నాహాలు మొదలు పెట్టింది. త్రివిక్రమ్, నితిన్, సమంతా ఈ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారని తెలుస్తుంది. అసలు ఈ సినిమా వేసవి లో అంటే మే లోనే విడుదలవ్వాల్సి వుంది.... కాని కొన్ని పెద్ద సినిమాల వల్ల ఈ సినిమా జూన్ కి పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే.