Advertisement
Google Ads BL

ప్రభాస్ ఆ డైరెక్టర్ కు ఓకే చెప్పాడా..?


మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ బోయపాటి శ్రీను. తులసి, భద్ర, లెజెండ్ వంటి మాస్ చిత్రాలను తెరకెక్కించిన బోయపాటి రీసెంట్ గా అల్లు అర్జున్ హీరోగా 'సరైనోడు' సినిమాను రూపొందించాడు. ఈ చిత్రానికి మాస్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే బోయపాటి తన తదుపరి చిత్రం బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళకముందే బోయపాటి మరో సినిమా చేయబోతున్నాడనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందించబోతున్నారని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం 'బాహుబలి 2' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఎవరితో కలిసి పని చేయబోతున్నాడనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపధ్యంలో బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో ప్రభాస్ ఓకే చెప్పాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs