ఈనెల 20వ తేదీన విడుదలైన మహేష్‌బాబు 'బ్రహ్మోత్సవం' చిత్రం భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఫస్ట్‌డే కలెక్షన్లు భారీగా వస్తాయని అందరూ భావించారు. అందులో తెలంగాణలో ఐదు షోలకు అనుమతి ఇవ్వడంతో ఈ చిత్రం ఓపెనింగ్స్ కుమ్మేస్తుందని అందరూ ఊహించారు. కానీ ఆ చిత్రం అంచనాలు అందుకోలేకపోయింది. నిరాశపరిచిన ఫలితాలు చూసి ట్రేడ్ పండిట్స్ సైతం ఆశ్యర్యపోతున్నారు. 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని భారీ ధరలకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోయే పరిస్ధితి ఏర్పడింది. రిలీజ్‌కు ముందే పివిపి ఈ చిత్రాన్ని మంచి లాభాలకు అమ్మేశాడు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి తల్లకిందులైంది. భారీ రేట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు చాలా ఏరియాల్లో 60శాతం వరకు నష్టపోయే పరిస్దితి ఉంది. అయితే వీరిని తాను ఆదుకుంటానని పివిపి మాట ఇచ్చినట్లు సమాచారం. నష్టాల్లో సగం తాను భరిస్తానని, లెక్కలు చూసి డబ్బులు చెల్లిస్తానని పివిపి డిస్ట్రిబ్యూటర్లకు హామీ కూడా ఇచ్చాడట. పివిపి మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంది డిస్ట్రిబ్యూటర్లకు సంతోషానిచ్చింది.