మహేష్ సినిమాలను గమనిస్తే గత కొంతకాలంగా వస్తే పెద్ద హిట్.. లేదా భారీ ఫ్లాప్ అని చెప్పవచ్చు. పవన్ విషయంలో 'గోపాల గోపాల' వంటి యావరేజ్ సినిమా ఉన్నప్పటికీ మహేష్ పరిస్ధితి మాత్రం అయితే హిట్ లేకపోతే ఫ్లాప్ అన్నట్లే కొనసాగుతోంది. అయితే ఈమధ్యకాలంలో దాదాపు అందరి పరిస్థితి ఇలాగే ఉంటోంది. మిక్స్‌డ్‌టాక్ వచ్చినా కూడా ఏదో ఒక విధంగా ప్రమోట్ చేస్తే టాక్‌తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్లు సాదిస్తున్నాయి. దానికి బన్నీ నటించిన 'సరైనోడు' పెద్ద ఉదాహరణ. కాగా ఇటీవల కాలంలో ఫ్లాప్ అయిన చిత్రాలను గమనిస్తే.. 'సర్దార్' చిత్రం 52.92కోట్లు వసూలు చేసింది. మహేష్ 'ఆగడు' చిత్రం 34.06కోట్లు, రామ్‌చరణ్ 'బ్రూస్‌లీ' 40.91కోట్లు, అల్లుఅర్జున్ 'వరుడు' చిత్రం 18కోట్లు షేర్, ఎన్టీఆర్ 'రామయ్యా..వస్తావయ్యా' 30.23కోట్లు, 'రభస' చిత్రం 26.34కోట్లు, ప్రభాస్ 'రెబెల్' చిత్రం 25.40కోట్లు వసూలు చేశాయి. దీన్ని ప్రకారం మన హీరోల డిజాస్టర్ స్టామినా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.