Advertisement
Google Ads BL

పివిపి..వెంకయ్యని పట్టి ప్లాన్ చేస్తున్నాడా!


పొట్లూరి వరప్రసాద్‌కు ఎంపీగా ఉండాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. అందుకే ఆయన పవన్‌ 'జనసేన' పార్టీ స్ధాపనలో వెనుక ఉండి ఆర్దికంగా కూడా సహాయపడ్డాడు. పవన్‌ పెద్దగా చంద్రబాబుకు రికమండేషన్‌ చేయకపోవడం వల్లే తాను 2014లో ఎంపీ కాలేకపోయాననే బాధ పివిపి లో ఉంది. ఇటీవల ఆయన పవన్‌ను కూడా తప్పుపడుతూ ఆయనతో సినిమా చేయను.. ఆయన మోసం చేశాడు అనే ధోరణిలో మాట్లాడాడు. ప్రస్తుతానికి పివిపి కాంగ్రెస్‌, టిడిపి, జనసేన, వైయస్సార్‌సీపీలలోకి వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇక పివిపి కోరికను తీర్చే ఏకైక మార్గం బిజెపినే. దాంతో ఆయన ఈ మధ్య వెంకయ్యనాయుడు పంచన చేరాడు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో బిజెపికి అవసరమైన ఫండ్‌ను ఇవ్వగలిగిన స్ధోమత ఉంది. దాన్ని ఆసరా చేసుకొని బలహీనంగా ఉన్న ఏపీలో బిజెపిని బలపరిచే హామీతో ఆయన బిజెపి కండువా కప్పుకోనున్నాడనేవ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనికి ఇటీవల ఆయన వెంకయ్యనాయుడుకు ప్రత్యేకంగా 'బ్రహ్మోత్సవం, ఊపిరి' వంటి చిత్రాలను పిలిచి మరీ చూపించాడు. సినిమా ఎలా ఉన్నా పొగడక తప్పదు కదా..! అని వెంకయ్య కూడా ఆయన చిత్రాలపై పొగడ్తలు, ప్రశంసలతో ముంచెత్తాడు.  ఎలాగూ ఇకపై సినిమాలు నిర్మించనని చెప్పేశాడు కాబట్టి..పివిపి..బిజెపి లో కీలకం కావడం తధ్యం అంటున్నారు రాజకీయ ప్రముఖులు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs