వరుణ్ తేజ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో 'మిస్టర్' అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ ప్రాజెక్ట్ సడెన్ గా మధ్యలోనే ఆగిపోయిందనే వార్తలు హల్ చల్ చేశాయి. వరుణ్ ఈ ప్రాజెక్ట్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడని అందుకే సినిమా ఆగిపోయిందని టాక్. వరుణ్ తేజ్ కూడా వెంటనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడు. దీంతో 'మిస్టర్' సినిమా ఇక ఉండదని భావించారంతా. నిజానికి ఈ వార్తల్లో నిజం లేదని చిత్రబృందం స్పష్టం చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకావాల్సింది. స్పెయిన్ లో మొదటి షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. అయితే యూనిట్ మెంబర్స్ కు స్పెయిన్ వీసా రావడం కాస్త లేట్ అవుతుందట. అంతేకాదు షూటింగ్ చేయాలనుకున్న కొన్ని ప్రాంతాల్లో పర్మిషన్స్ కూడా దొరకలేదట. దీంతో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని.. యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు.