Advertisement
Google Ads BL

చిరు డేట్ ఫిక్స్ చేశాడు!


మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక లాంఛనంగా జరిగినప్పటికీ.. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే జూన్ 6 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని చిత్రబృందం వెల్లడిస్తోంది. తమిళ 'కత్తి' సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చిరంజీవికి తగినట్లుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన నటించేందుకు అనుష్కను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. అలానే ఈ సినిమాలో మరో హీరోయిన్ కేథరిన్ తెరెసా కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. వినాయక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనేది చిత్రబృందం ఆలోచన.  

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs