సూపర్ మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కావడానికి విశ్రాంతి లేకుండా పని చేశాడు. ప్రమోషన్స్ లో కూడా చురుకుగా పాల్గొన్నాడు. ఇక కాస్త రిలాక్స్ అవ్వడానికి తన కుటుంబంతో కలిసి మూడు వారాల పాటు లండన్ ట్రిప్ కు వెళ్తున్నాడు. ఈరోజు సాయంత్రమే లండన్ బయలుదేరనున్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మహేష్ కావాలనే లండన్ ట్రిప్ ప్లాన్ చేశాడని మాట్లాడుకుంటున్నారు. 'బ్రహ్మోత్సవం' సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో దాని గురించి ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని, అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి నుండి తప్పించుకోవడానికే లండన్ వెళ్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ సన్నిహితులు మాత్రం ఈ ట్రిప్ బ్రహ్మోత్సవం సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ప్లాన్ చేసుకున్నారని మహేష్ ఎవరినుండో తప్పించుకోవడానికి వెళ్ళట్లేదని వారిస్తున్నారు. గతంలో మహేష్ నటించిన ఖలేజా చిత్రం ఫ్లాప్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కు తన తరఫున అందించాల్సిన సహాయం మహేష్ అందించాడని వారి వాదన. ఈ ట్రిప్ పూర్తయిన తరువాత మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.