రాజమౌళికి కృష్ణుడు దొరికాడు!
బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డైరెక్టర్ రాజమౌళి లైఫ్ యాంబిషన్ మహాభారతం చిత్రాన్ని రూపొందించడం. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. నేటి టెక్నాలజీలో భారతం తీయడం కష్టం కాకపోవచ్చు. కానీ పౌరాణిక పాత్రలకు ఆర్టిస్టులు లభించడమే కష్టం. ఆర్టిస్టుల కోసం అన్వేషణ రాజమౌళి చేస్తూనే ఉన్నారని సమాచారం. బాహుబలి 2 తర్వాత మహాభారతాన్ని తెరకెక్కించే పనిలో పడతారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఇకపోతే భారతంలో అత్యంత ప్రధానమైన పాత్ర శ్రీకృష్ణుడు. గతంలో ఎన్టీఆర్ ఈ పాత్రకు వన్నెతెచ్చారు. నేటి జనరేషన్ ఆర్టిస్టులో కృష్ణుడు పాత్రకు ఎవరైతే బావుంటారు? అనే రాజమౌళి అన్వేషణకు దాదాపు తెరపడింది. ఎందుకంటే రాజమౌళి వంటి డైరెక్టర్ ఉంటే తను పౌరాణిక పాత్రలు చేయడానికి సిద్దమని సూపర్ స్టార్ మహేష్ బాబు తన మనసులోని మాటను వెల్లడించారు. ఇది అభిమానులకు, సినీ ప్రియులకు సంతోషం కలిగించే వార్త. మహేష్ ఏ పౌరాణిక పాత్రకు సరిపోతారనేది కొంత ఊహించవచ్చు. ఆయన శ్రీకృష్ణుడిగా నటిస్తే బావుంటుందనేది అభిమానుల కోరిక. రాజమౌళి దర్శకత్వంలో అయితే చేస్తానని మహేష్ సూత్రప్రాయంగా చెప్పారు. అంటే రాజమౌళి తీయబోయే మహాభారతంలో అత్యంత ముఖ్యమైన శ్రీకృష్ణుడి పాత్రకు మహేష్ సిద్దమన్నమాట. ఇక దీనిపై స్పందించాల్సింది జక్కన్నే.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads