Advertisement
Google Ads BL

బాలయ్య పార్టీలో ఆ హీరోయిన్ తో డాన్సులు!


నందమూరి బాలకృష్ణకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ సంవత్సరం బాలయ్య పుట్టినరోజును అభిమానులే ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో గల బాలయ్య అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకలను వారి ప్రాంతంలోనే జరపనున్నారు. అయితే ఈ వేడుకల్లో నటి హంసానందినితో ఒక డాన్స్ ప్రోగ్రాం ను కండక్ట్ చేస్తున్నారు. ఆమెతో కలిసి బాలయ్య కూడా డాన్సులు వేయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఇదివరకు హంసానందినితో కలిసి 'లెజెండ్' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించాడు. మరోసారి తనతో డాన్సులు వేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే అది సినిమాలో కాకుండా ఓ ప్రైవేట్ పార్టీలో చేయనుండడం విశేషం. అలానే కాలిఫోర్నియాలో ఉన్న అభిమానులంతా కలిసి ఫండ్స్ ను పోగేసి బసవతారకం కాన్సర్ హాస్పిటల్ కు విరాళంగా ఇవ్వనున్నారు. జూన్ 10న జరగబోయే ఈ వేడుకలోనే బాలకృష్ణ తన 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs