అధికార పీఠం ఎక్కి రెండేళ్లు అయిన సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రులు, ఎమ్మేల్యేల విషయంలో ఓ రహస్య సర్వే చేయించాడనే సంగతి ఇప్పుడు తెలంగాణలోని టిఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మేల్యేల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. తన మంత్రులు, ఎమ్మేల్యేల పనితీరు ఎలా ఉంది? వారేమైనా అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నారా? అవినీతి చేస్తున్నారా? ఆయా నియోజకవర్గాల్లో, తెలంగాణ రాష్ట్రంలో వారి మీద ప్రజలకు ఉన్న అభిప్రాయం ఏమిటి? అనే విషయాలను కేసీఆర్ సర్వే నిర్వహించాడట. మంత్రులు, ఎమ్మేల్యేలు కలిసి మొత్తంగా 30మందికి నెగటివ్ మార్కులు వచ్చాయని సమాచారం. దీంతో వారి తోకను కట్ చేయాలని, వచ్చే ఎన్నికల తర్వాతే కాదు.. రాబోయే 30 ఏళ్లు అధికారంలోనే ఉండాలని కోరుకుంటున్నాడు కేసీఆర్ ఈ సర్వే విషయం తెలిసిన తర్వాత ఆ రాష్ట్ర ఎమ్మెల్మేలకు, మంత్రులకు భయం పుట్టుకొచ్చిందట. కేసీఆర్ వద్ద ఉన్న లిస్ట్‌లో తమ పేర్లు ఉన్నాయా? అనే విషయం వారికి నిద్రపట్టనివ్వకుండా చేస్తోంది. మొత్తానికి కేసీఆర్ తన పార్టీ వారిపైనా, ప్రభుత్వంలో ఉన్న వారిపైన నిఘా పెట్టడం కొందరిలో కలవరం పుట్టిస్తోంది. ఇంతకీ ఆ సర్వేలో తేలిన 30మంది ఎవరు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మొత్తం మీద కేసీఆర్ మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా హిట్లర్‌నని నిరూపించుకుంటున్నాడు. అయితే ఇదే సర్వేలో కేటీఆర్, హరీష్‌రావు వంటివారి పేర్లు ఉంటే అప్పుడు కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుంది? అనే ప్రశ్న తెలంగాణకు చెందిన ఎమ్మెల్మేలు, మంత్రుల మదిని తొలిచేస్తున్న ప్రశ్నగా చెబుతున్నారు.