Advertisement
Google Ads BL

బన్నీ నీకిది సరైనదా..?


'చెప్పను బ్రదర్' ఈ ఒక్క పదం అనడంతో అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ చేస్తూ.. అభిమానులు పెద్ద దుమారానికే తెరలేపారు. ఈ మాట బన్నీ వేరేవరి గురించో అనుంటే ఇంత హాట్ టాపిక్ అయ్యేది కాదు. అభిమానులు దేవుడిగా కొలిచే పవర్ స్టార్ గురించి నేనేం 'చెప్పను బ్రదర్' అని అల్లు అర్జున్ అనడం వలన పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. నిన్న శిల్పకళావేదికలో జరిగిన 'ఒక మనసు' సినిమా ఆడియో ఫంక్షన్ లో బన్నీ మాట్లాడాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ ఫ్యాన్స్ ను కడిగి పారేశాడు బన్నీ. దీని కోసం ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చినట్లున్నాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కొంతమంది గ్రూప్స్ గా మారి కావాలనే 'పవర్ స్టార్.. పవర్ స్టార్' అని అరుస్తున్నారని కామెంట్ చేశాడు. మెగాహీరోలకు సంబంధం లేని వేడుకలో ఇలా అరవడం వలన ఆ చిత్ర దర్శకనిర్మాతలు తమ సినిమా గురించి మాట్లాడుకోలేకపోతున్నారని, ఇలా ఇతర చిత్రాల వేదికలను పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదని అభిమానులకు హితవు చెప్పి తను మాత్రం అదే తప్పు చేశాడు. తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పడానికి 'ఒక మనసు' ఆడియో వేడుకను వేదికగా ఎంచుకున్నాడు బన్నీ. లక్షలు ఖర్చు పెట్టి 'ఒక మనసు' నిర్మాతలు ఆడియో వేడుకను ఘనంగా చేయాలని అనుకున్నారు. కానీ తీరా ఆడియో వేడుక బన్నీ వివరణ వేదికగా తయారయ్యింది. సో.. ఇది చూసిన వారంతా.. అభిమానులకు హితవు పలికి తను మాత్రం మళ్ళీ అదే తప్పు చేసాడని అందరూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs