Advertisement
Google Ads BL

నిఖిల్.. 'అమల' కాదు..టైటిల్ ఫిక్స్!


హ్యాట్రిక్‌ హిట్స్‌ తర్వాత హీరో నిఖిల్‌ చేసిన 'శంకరాభరణం' మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు వచ్చిన రిజల్ట్‌తో ఇకపై చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భావించిన నిఖిల్‌..'టైగర్‌' మూవీ దర్శకుడు విఐ ఆనంద్‌ చెప్పిన కథ నచ్చడంతో..వెంటనే మూవీని ఒప్పేసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ 60 శాతం షూటింగ్‌ని కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకి 'అమల' అనే టైటిల్‌ ఖరారైందంటూ కొద్ది రోజుల క్రితం ఓ వార్త హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. మేకర్స్‌ అతి త్వరలో ఈ టైటిల్‌ని అనౌన్స్‌ చేయబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నిఖిల్‌, విఐ ఆనంద్‌ దర్శకత్వంలో మేఘన ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా!' అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్న ఈ టైటిల్‌ నిఖిల్‌కి కరెక్ట్‌గా సెట్‌ అవుతుందని భావించే..మేకర్స్‌ ఈ మూవీకి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా!' ని ఫిక్స్‌ చేసినట్లుగా తెలుస్తుంది. అతి త్వరలో ఈ టైటిల్‌ని అఫీషియల్‌గా చిత్ర యూనిట్‌ అనౌన్స్‌ చేయనుందని సమాచారం. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs