Advertisement
Google Ads BL

'చెప్పను బ్రదర్' అంటూనే బన్నీ చెప్పేశాడు!


'సరైనోడు' ఫంక్షన్ లో అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అడిగితే 'చెప్పను బ్రదర్' అన్నాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై క్లారిటీ ఇస్తూ.. బన్నీ 'ఒక మనసు' ఆడియో ఫంక్షన్ లో మాట్లాడాడు. ''మీరు ప్రతి సారి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి కారణం పవన్ కళ్యాన్ గారు కాదు. అసలు ఆయనకు సంబంధమే లేదు. నేను మాట్లాడకుండా వెళ్ళిపోవడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను కొంతమంది అభిమానులు మాత్రమే.. ఆడియో ఫంక్షన్స్ కి వచ్చే కొందరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గ్రూప్ గా ఫాం అయ్యి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచి ఫంక్షన్ ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ వలనే నేను పవర్ స్టార్ గురించి మాట్లాడకుండా టాపిక్ ఎవైడ్ చేశాను. ఫంక్షన్ కు వచ్చే ఆర్టిస్ట్స్ తమ పెర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలనుకుంటారు. కాని కొంచెం భయం ఉంటుంది. అలాంటి సమయంలో పవర్ స్టార్ అని అరవడం వలన మెకానికల్ గా ఏదో మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఒక పెద్ద దర్శకుడు వంద రోజులు కష్టపడి సినిమా తీసి ఆడియో ఫంక్షన్ పెట్టుకొని తన సినిమా గురించి మాట్లాడదామనుకుంటే.. అప్పుడు కూడా పవర్ స్టార్ అని అరిచి ఆ సినిమా గురించి చెప్పనివ్వకుండా చేస్తున్నారు. అభిమానులుగా మీరు వారికి గౌరవం ఇవ్వాలి. మెగా హీరోలు లేని బయట ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవడం చాలా తప్పు బ్రదర్. అవతలి హీరోలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. దాని వలన మనం పెరుగుతామే.. కాని తగ్గం. 'బ్రదర్ మా వాళ్ళ ఫంక్షన్ లో మీ వాళ్ళ గోలెంటని' ఒకరు నన్ను అడిగారు. 'అబ్బా అనుకున్నాను'.. అది మన తప్పే కదా.. ఇంకో విషయం 'నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా అన్నయ్యే అని కొన్ని వందల సార్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాంటి చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయనను  మరొక మాట మాట్లాడనివ్వకుండా.. పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తున్నారు. ఆ విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను బ్రదర్. మనకి ప్లాట్ ఫాం క్రియేట్ చేసింది అలంటి మెగాస్టార్ గారిని కూడా మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. మీరు ఎంత అరిచిన నేను పవర్ స్టార్ గురించి చెప్పను. కొన్ని వందల సార్లు ఆయన గురించి నేను చెప్పాను. నా సినిమాల్లో కూడా చెప్పాను. కొత్తగా చెప్పాలా..? చాలా ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ గురించి అడిగితే నేను చెప్పలేదు. కాంట్రవర్సీ ఎందుకు అని ఎవైడ్ చేశాను కానీ.. ఎవైడ్ చేయడం వలన ఇంత కాంట్రవర్సీ అవుతుందనుకోలేదు. ఈ సమయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడు హిట్స్ కొట్టాడు కదా.. అందుకే పవర్ స్టార్ గురించి మాట్లాడట్లేదని అపార్ధం చేసుకుంటారు. నేను పవర్ స్టార్ గురించి మాట్లాడకుండా వెళ్ళిపోయినప్పుడు మీరు బాధపడి ఉంటారు. కాని నేను మిమ్మల్ని హర్ట్ చేసినదానికంటే వంద రెట్లు మీరెక్కువ హార్ట్ చేశారు మమ్మల్ని. దయచేసి మీ అల్లరిని ఒక లిమిట్ లో పెట్టుకోండి. పబ్లిక్ లో మనం తగ్గద్దు. నన్ను ఇష్టపడే ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి సోషల్ మీడియాలో వెర్బల్ వార్ ఆపండి.. చాలా చీప్ గా ఉంది. మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. నా ఒక్కడికే ఇబ్బంది వస్తే పర్లేదు.. నా వలన నా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా చిరంజీవి గారికి మచ్చ రావడం నాకిష్టం లేదు'' అని చెప్పారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs