Advertisement
Google Ads BL

దిల్ రాజు ఈ హీరో దగ్గరైనా.. ఆగుతాడా?


'శతమానం భవతి' ఈ సినిమా పేరు చాలా రోజుల నుండి వినిపిస్తోంది. దిల్ రాజు బ్యానర్ లో సతీష్ వేగ్నేస దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాలో హీరోగా చాలా మంది పేర్లు వినిపించాయి. ముందుగా దిల్ రాజు బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తోన్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో నటించబోతున్నాడనే వార్తలు వినిపించాయి. తేజు కూడా రెండు, మూడు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఏమైందో తెలియదు కానీ.. తేజు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత రాజ్ తరుణ్ పేరు వినిపించింది. ఆల్మోస్ట్ రాజ్ తరుణ్ ఈ సినిమాలో హీరో అనుకున్నారంతా.. అయితే రాజ్ తరుణ్ ప్రవర్తన నచ్చకపోవడం వలన దిల్ రాజు తనను తప్పించాడని టాక్. కాని దిల్ రాజు మాత్రం మా మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడనుకోండీ.. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ నటించబోతున్నాడని మరొక వార్త హల్ చల్ చేస్తోంది. సతీష్ చెప్పిన కథ నచ్చడంతో శర్వా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రాలేదు. మరి దిల్ రాజు ఈ హీరో దగ్గరైన ఆగుతాడో లేదో చూడాలి..!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs