గతకొన్ని రోజులుగా అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' పై జరుగుతున్న కాంట్రవర్సీ తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ దీనిని సీరియస్‌గా తీసుకోవడం, బ్యానర్స్, పోస్టర్స్‌తో బన్నీపై తిరుగుబాటుకి రెడీ అవ్వడం కూడా చూస్తూనే ఉన్నాం. పవన్ ఫ్యాన్స్ 'చూసుకుంటాం బ్రదర్' అనే స్థాయికి వచ్చారంటే విషయం ఎంత వరకు వెళ్ళిందో అర్ధమవుతూనే ఉంది. అయితే ఇదంతా అసలు ఎందుకు వచ్చింది? అల్లు అర్జున్.. సరైనోడు వైజాగ్ ఫంక్షన్‌లో పవన్ గురించి 'చెప్పను బ్రదర్' అనడానికి అసలు కారణం ఏమిటి? అంటే తాజాగా ఓ విషయం బయటికి వచ్చింది. పవన్‌కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్‌సింగ్'కి సంబంధించి ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో 'జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్' లా డ్యాన్స్ నేను చేయలేను..అని చెప్పడమే బన్నీలో ఈ మార్పుకి కారణంగా తెలుస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్యాన్స్ విషయంలో చిరంజీవి తర్వాత పేరు చెప్పాల్సి వస్తే..ముందు అల్లు అర్జున్ పేరే చెప్పాలి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్..ఆ తర్వాతే రామ్‌చరణ్. కానీ పవన్ కళ్యాణ్..బన్నీ పేరు చెప్పకుండా ఎన్టీఆర్, చరణ్ అని మాత్రమే అన్నాడు. అప్పుడు పవన్‌కళ్యాణ్ తన గురించి చెప్పనప్పుడు..ఇప్పుడు పవన్ గురించి తానెందుకు చెప్పాలి..అనే 'చెప్పను బ్రదర్' అని సింపుల్‌గా బన్నీ విషయాన్ని ప్రక్కకు నెట్టేశాడు. ఈ రకంగా చూస్తే..బన్నీ చేసింది కరెక్టే అనిపిస్తుంది. తమ ఫ్యామిలీ హీరోని కాకుండా ఎన్టీఆర్ పేరు చెప్పినప్పుడు మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వలేదు. కానీ..బన్నీ ఒక్క మాట అన్నందుకు ఇలా ఎందుకు చేస్తున్నారో..వారికే తెలియాలి. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి. బన్నీ చెప్పనంత మాత్రాన పవన్ కున్న ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా..! ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో కొంత ఆలోచించాలి. దీని వల్ల మెగా హీరోల అలాగే మెగా ఫ్యాన్స్ యొక్క పరువు బజారున పడుతుందనే విషయం గమనిస్తే మంచిది. దీన్ని ఆసరాగా తీసుకుని ఇతర హీరోల ఫ్యాన్స్ ఇంకొంచెం చెలరేగే అవకాశం ఉంటుంది. సో..మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.