Advertisement
Google Ads BL

'అజర్‌'పై వివాదాలు చెలరేగుతున్నాయి!


ఇటీవలే ఇండియన్‌ మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ స్వీయ జీవితం ఆధారంగా ఇమ్రాన్‌హష్మీ ప్రధాన పాత్రను పోషించిన బయోపిక్‌ మూవీ 'అజర్‌' చిత్రం విడుదలై డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తన పాత్రను అమ్మాయిల కోసం వెంపర్లాడే వాడిగా చిత్రీకరించడంతో ఇండియన్‌ మాజీ కెప్టెన్‌ రవిశాస్త్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  ఆయన ఇప్పటికే బిసిసిఐకి ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా ఫిక్సింగ్‌లో అజర్‌ ఫ్రెండ్‌ మనోజ్‌ప్రభాకర్‌ కూడా తనను ఈ చిత్రంలో తప్పుగా చిత్రీకరించారని మండిపడుతూ పరువునష్టం దావా వేయడానికి సిద్దం అవుతుండటం గమనార్హం. మొత్తానికి చిత్రం హిట్‌ కాకపోయినా వివాదాల విషయంలో మాత్రం ఈ చిత్రం అన్నింటికంటే ముందుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs