డైలాక్స్ పలికినవాడు గొప్పనా, లేక రాసినవాడా.. ఈ విషయం తేల్చిచెప్పాల్సింది మంచు మోహన్ బాబు. ఆయన వివిధ సినిమాల్లో పలికిన సంభాషణలను ఒక పుస్తకంగా తెచ్చారు. బ్రిటన్ పార్లమెంట్ హాల్లో విడుదల చేశారు.
కేవలం తెలుగు చిత్రాల్లోనే నటించిన మోహన్ బాబు పలికిన డైలాగ్స్ బుక్ ను లండన్ లో రిలీజ్ చేయడం చాలామందికి అర్థం కాలేదు. ఆయన పక్కా తెలుగు నటుడు, సుమారు 500ల చిత్రాల్లో నటించారు. నాలుగు దశాబ్దాల కెరీర్ పూర్తిచేశారు. తెలుగువారి ఆదరాభిమానాలతో ఎదిగాడు. ఇక్కడ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫంక్షన్ చేసుకోకుండా లండన్ లో వెన్యూ ఎందుకు పిక్స్ చేసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి దీనిపై పూర్తి వివరణ ఇవ్వాల్సింది మంచు కుటుంబమే.
నాలుగు దశాబ్దాల కెరీర్ పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవున వేడుక నిర్వహించాలని ఆయన తనయుడు మంచు బ్రదర్స్ నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత డైలాగ్స్ బుక్ తో శ్రీకారం చుట్టారు.
ఐదు వందల చిత్రాల్లో మోహన్ బాబు పలికిన డైలాగ్స్ క్రెడిట్ ఎవరికి చెందుతుంది, ఆయా డైలాగ్స్ రాసిన రచయితలు కూడా భాగస్వాములు అవుతారు. వారి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇక ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబు డైలాగ్ లు బాగా చెప్పగలడు అని ఎవరన్నారో కాని, మైక్ దొరికితే మాత్రం సీనియర్ మంచు గారు చెప్పుకుంటుంటారు. ఎన్టీఆర్ తర్వాత తనే అనడం ద్వారా ఇతర సీనియర్ హీరోలను అవమానించినట్టు కాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీనిపై స్పందించాల్సింది ఆయా హీరోలు లేదా వారి సంబంధికులు.