Advertisement
Google Ads BL

గురువిందగింజ సామెతను గుర్తుతెస్తున్న బిజెపి!


రాష్ట్ర బిజెపి ప్రదాన నాయకుల సమక్షంలోనే ఆంద్రప్రదేశ్‌ బిజెపి ఇన్‌చార్జ్‌ సిద్దార్ధ్‌నాద్‌సింగ్‌ టిడిపిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఆయన వ్యాఖ్యలకు టిడిపి నాయకులు ధీటుగా స్పందించడం లేదు. వాస్తవానికి బిజెపికి ఏపీలో ఉన్న బలం ఏమిటో? అందరికీ తెలుసు. వారికి ఇక్కడ వచ్చేది లేదు... పోయేది లేదు. ఏదో ఒక ప్రాంతీయపార్టీతో ఎన్నికల నాటికి పొత్తుపెట్టుకొని ఆ నాలుగైదు స్దానాలు సాధించడం తప్ప.. ఇక్కడ బిజెపి ఒరిగేది ఏమీ ఉండదు. అందుకే వారు ముందు వెనుక ఆలోచించకుండా మిత్రపక్షమైన టిడిపిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమకు ప్రత్యేక హొదా కావాలని చంద్రబాబు అసలు అడగనే లేదు.. అంటూ తప్పునంతా చంద్రబాబుపై వేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రత్యేకహోదాను ఎందుకు వద్దంటాడు? అనేది అందరి మదిని తొలిచేస్తున్న ప్రశ్న. 

Advertisement
CJ Advs

ఇక పనిలో పనిగా ఆయన తెలుగు దేశం చేస్తున్న పార్టీ ఫిరాయింపులు అనుచితమని, టిడిపి చిల్లర వేషాలువేస్తోందని చెప్పడం ద్వారా వైయస్సార్‌సీపీ అద్యక్షుడు జగన్‌కు లైనేస్తున్నారు. దీంతో వైయస్సార్‌సీపీ నాయకులు ఆనందంలో తేలియాడుతున్నారు. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా స్పందిస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తమ వల్లనే టిడిపి లబ్ది పొందిందనేది బిజెపి నాయకులు ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. పోనీ టిడిపి చేయిస్తున్న పార్టీ ఫిరాయింపులు చిల్లరపనులు అయితే బిజెపి ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో చేస్తున్న, చేసిన పని ఎంతటి సిగ్గుచేటో ఆ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలి. చంద్రబాబుకు తెలిసినంత మిత్రధర్మం, హుందాతనం బిజెపి నాయకులకు లేకపోవడం సిగ్గుచేటు. అయితే టిడిపి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాత్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే బిజెపికి కూడా కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని, మోడీ అంటే ఇంతకాలం ఉన్న గౌరవం, ఆయన మాటలకు ఉన్న నిబద్దత వంటివన్నీ నాశనమై పోయి దేశవ్యాప్తంగా మోడీ ప్రతిష్ట దెబ్బతింటుందని బాల్‌ను మోడీ కోర్టులోకి విసిరే ప్రయత్నం చేశాడు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs