కోట్లాది రూపాయల పెట్టుబడితో తీసే సినిమాలను రిలీజ్ చేసేముందు ప్రేక్షకులను ప్రిపేర్ చేయాలి. సినిమా చూడాలనే ఉత్సాహాన్ని కలిగించాలి. అప్పుడే టార్గెట్ రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మహేష్ బాబు బాగా అనుభవం గడించాడు. తను భాగస్వామిగా ఉన్న శ్రీమంతుడు చిత్రాన్నిఅద్భుతంగా ప్రమోట్ చేశారు. హీరో అయినప్పటికీ బేషజాలకు పోకుండా మీడియా ద్వారా వచ్చే ఉచిత ప్రచారాన్ని బాగా ఉపయోగించుకున్నారు. ఈ విషయంలో నమ్రతా శిరోద్కర్ సహకారం కూడా ఉంది. అందుకే విడుదలకు ముందే శ్రీమంతుడుపై అందరికీ ఆసక్తి నెలకొంది. సరిగ్గా ఇదే ఫార్ములాను బ్రహ్మోత్సవం సినిమా కోసం పాటిస్తున్నారు. ఇందులో కూడా మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. శ్రీమంతుడు ఫార్ములా తరహాలోనే బ్రహ్మోత్సవానికి ప్రచారం నిర్వహించడం వల్ల ప్రేక్షకుల్లో అటెన్షన్ పెరిగింది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపై నిలవడానికి కారణమైంది. ఎక్కువ ధియేటర్లలో రిలీజ్ చేసినా భారీ ఓపనింగ్స్ కు ఢోకా ఉండదు. ఎందుకంటే సినీ ప్రియులందరూ బ్రహ్మోత్సవం కోసం ఎదురుచూసేలా ప్రచారం జరిగింది. స్టార్ హీరోలు తమ సినిమాల కోసం ఈ తరహాలో ప్రచారం నిర్వహిస్తే నిర్మాతలకు సైతం భారం తగ్గుతుంది.