అల్లు అర్జున్ కు అకస్మాత్తుగా తెలుగు మీడియా గుర్తుకువచ్చింది. సరైనోడు సక్సెస్ గురించి, కలక్షన్ల గురించి వారిని పిలిచి మరీ చెప్పుకున్నాడు. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడన్నమాట. ఇవే విషయాలను ఇతర భాషల మీడియాకు చెబితే రాయరు. అందుకే తన సినిమా హిట్ అంటూ చెప్పుకోవడం కోసం తెలుగు మీడియాను ఆశ్రయించారు. సరైనోడు రిలీజ్ కు ముందు ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లి అక్కడి మీడియాతో కబుర్లు చెప్పుకున్న బన్నీకి తెలుగు మీడియా మాత్రం గుర్తుకురాలేదు. నిజానికి తెలుగు మీడియా మన స్టార్స్ ఇమేజ్ ను కాపాడుతుంది. వివాదాలను హైలెట్ చేయదు. వ్యక్తిగత విషయాల జోలికి వెల్లదు. అందుకే చాలామంది స్టార్స్ తెలుగు మీడియా ది బెస్ట్ అని పలుసందర్భాల్లో చెప్పేవారు. అల్లు అర్జున్ కు ఈ విషయాలు తెలియవని అనుకోవాలా, కేవలం నిర్లక్షం కారణంగానే తెలుగు మీడియాను చిన్నచూపు చూశారనేది సుస్పష్టం. ఇప్పుడేమో తన విజయాన్ని చెప్పుకోవడానికి మళ్లీ తెలుగు మీడియానే గతైంది. తను నటించిన సరైనోడు సూపర్ హిట్ అయినా, ఎక్కడా దాని ప్రస్తావనే లేదు. మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్ర విజయాన్ని మీడియా ఫోకస్ చేసింది. కలక్షన్లను ఎప్పటికప్పుడు అందించింది. అదే సరైనోడు విషయంలో జరగలేదు. కారణం బన్నీకి మీడియా రిలేషన్స్ లేకపోవడం. అతని వ్యవహారాలు చూసేవారికి అవగాహన లోపం వల్లే ఇది జరిగింది. సరైనోడు రివ్యూల గురించి కూడా బన్నీ కామెంట్ చేస్తూ తను చదవను అని నిర్లక్షంగా సమాధానం చెప్పాడు. ఆయన తీరు ఎలా ఉందంటే నేను అద్దంలో చూసుకోను అని చెప్పినట్టు ఉంది. రివ్యూలు అనేవి సినిమా విజయాన్ని తెలియజేయవు. విశ్లేషణ చేస్తాయి. కథలో లోపాలను ఎత్తిచూపుతాయి. మంచి ఉంటే ప్రశంసిస్తాయి. ఆర్టిస్టుల అభినయాన్ని విశ్లేషిస్తాయి. ఇది తెలుసుకోకుండా బన్నీ మాట్లాడ్డం అతని అవివేకాన్ని తెలియజేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలికి కూడా మీడియా 3.5 వరకే రేటింగ్ ఇచ్చిందని బన్నీ తెలుసుకుంటే మంచిది.