Advertisement
Google Ads BL

పవన్‌కి మరో దర్శకుడు ఫిక్స్‌ అయ్యాడు!


ప్రస్తుతం ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఈ చిత్రం తర్వాత ఎ.యం.రత్నం నిర్మాతగా తమిళంలో పెద్ద విజయం సాధించిన అజిత్‌ చిత్రం 'వేదాలమ్‌' రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా దర్శకునిగా పరిచయం ఉన్న శివకే ఈ చిత్రం దర్శకత్వ బాద్యతలను అప్పగిస్తారని అందరూ ఊహించారు. కానీ విచిత్రంగా ఈ చిత్రానికి మరో తమిళ దర్శకునికి అవకాశం ఇచ్చారు. విజయ్‌, మోహన్‌లాల్‌ను కలిసి నటించిన 'జిల్లా' చిత్రానికి దర్శకత్వం వహించిన నేశన్‌ దర్శకత్వంలో పవన్‌ హీరోగా 'వేదాలమ్‌' రీమేక్‌ రూపొందనుందని సమాచారం. ఈ విషయాన్ని నేశన్‌ కన్‌ఫర్మ్‌ చేశాడు. ప్రస్తుతం పవన్‌తో డిస్కషన్స్‌ జరుగుతున్నాయని ఆయన కోలీవుడ్‌ మీడియాకు తెలిపాడు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs