ఒకప్పుడు దర్శకుడు కృష్ణవంశీ చిత్రాలంటే స్క్రీన్ నిండా ఆర్టిస్ట్‌లతో కళకళలాడుతూ ఉండేవి. 'నిన్నే పెళ్లాడతా, మురారి, చందమామ' వంటిి చిత్రాలే దానికి ఉదాహరణ. అయితే ఇటీవల కృష్ణవంశీ ఫామ్‌లో లేడు.సో.. ఆ బాధ్యతలను శ్రీకాంత్ అడ్డాల తీసుకున్నాడా? అనిపించకమానదు. ఆయన తీసిన 'కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి చిత్రాలే దీనికి ఉదాహరణ. కాగా ఆయన చిత్రాలన్నీ కుటుంబ బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, భావోద్వేగాలతో నిండి ఉండి ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉంటాయి. కానీ ఇటీవల ఆయన 'ముకుంద' చిత్రంతో కాస్త యాక్షన్‌ను మిళితం చేసి చూశాడు. ఫలితం బాగా రాలేదు. దాంతో ఇప్పుడు తన పాత స్టైల్‌కి వచ్చేశాడు. ఇక 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో మహేష్ బాడీ లాంగ్వేజ్‌ను, డైలాగ్ డెలివరీని మార్చివేశాడు. తాజాగా 'బ్రహ్మోత్సవం' చిత్రంలో మరలా సేమ్ టు సేమ్ అలాంటి డిఫరెంట్ స్టైల్, డైలాగ్ డెలివరితో మహేష్‌ను చూపిస్తున్నాడు. మొత్తానికి ఈ చిత్రం కూడా మంచి ఘనవిజయం సాధిస్తే.. ఇకపై శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారడం ఖాయం అంటున్నారు.