వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, దివంగత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్ అంటే అటు చిరుకు, ఇటు పవన్‌కుఎందుకంత కోపం? అనే విషయం ఇప్పుడు అంతటా హల్‌చల్‌చేస్తోంది. గత ఎన్నికల్లో కేవలం కేంద్రంలోని బిజెపికి మాత్రమే మద్దతు ఇస్తున్నానని మొదట పవన్ ప్రకటించాడు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మీకు నచ్చినవారికి ఓటేయమని చెప్పాడు. కానీ కొద్దిరోజుల్లోనే మనసు మార్చుకొని టిడిపిని సపోర్ట్ చేశాడు. రాష్ట్రం ఉన్న క్లిష్టపరిస్థితుల్లో చంద్రబాబు లాంటి వారైతేనే ముఖ్యమంత్రి పదవికి అర్హులని ఆయన చెప్పాడు. జగన్‌పై మాత్రం ఆయన ఇప్పటికీ అప్పుడప్పుడు తన ఆగ్రహం ప్రకటిస్తూనే వస్తున్నాడు. ఇక తాజాగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చిరంజీవి విషయంలో ఓ విషయం చెప్పారు. తాను కాంగ్రెస్‌ను వీడి టిడిపితో చేరే సమయంలో తాను చిరును కలుసుకొని కాంగ్రెస్‌ను వీడుతున్నానని చెప్పానని, అప్పుడు చిరు 'నువ్వు వెళ్తున్నది చంద్రబాబు దగ్గరకే కదా...! బాధ లేదు. జగన్ దగ్గరకు వెళ్లడం లేదు. అదే సంతోషం' అన్నాడని చెప్పాడు. అంటే వ్యక్తిగతంగా పార్టీ పరంగా చిరంజీవికి, పవన్‌కు జగన్ అంటే ఎందుకంత కోపం అనే విషయంపై ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ నడుస్తోంది.
వాస్తవానికి తన 'ప్రజారాజ్యం' పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, వైయస్ మరణానంతరం కాంగ్రెస్‌పార్టీకి తాను అపద్బాంధవుడిగా మారిపోతానని చిరు భావించాడు. తనను మించిన ప్రజాకర్షక నేత కాంగ్రెస్‌లో ఇంకెవ్వరూ లేకపోవడంతో తానే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దిక్కు అవుతానని చిరు ఆశపడ్డాడు. కానీ మధ్యలో జగన్ సీన్‌లోకి రావడం, ఓదార్పుయాత్రల ద్వారా కాంగ్రెస్‌ను, సోనియాగాంధీని ఎదిరించి తనకంటూ ఓ పెద్ద ఫాలోయింగ్‌ను, వైయస్ రాజశేఖర్‌రెడ్డికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఆయన సింపతీ మొత్తాన్ని జగన్ మూటగట్టుకోవడంతో చిరుకు పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాలేకపోయినప్పటికీ ఎక్కువ స్దానాలలో జగన్ పార్టీ గెలవడం, కాంగ్రెస్‌కు రాష్ట్రవిభజన దృష్ట్యా ఒక్క సీటు కూడా రాకపోవడం,డిపాజిట్లు కూడా గల్లంతు కావడంతో చిరు రాజకీయ ప్రస్దానానికి స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. దీంతోనే చిరుకు జగన్ పెద్ద పోటీదారుగా అందరూ భావించడం చిరుకు మింగుడు పడని అంశంగా మారిందనేది వాస్తవం.