సాయి ధరమ్ తేజ్ హీరోగా 'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సుప్రీమ్'. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి మాస్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. మే 5న విడుదలయిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి సుమారుగా 5.77 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. దీంతో చిత్రబృందం సినిమా సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశారు. మే 8న సుప్రీమ్ సక్సెస్ మీట్ జరగబోతోంది. అయితే ఈ కార్యక్రమంలో కొంతమందిని ప్రత్యేకంగా గౌరవించబోతున్నట్లు టాక్. ఇంతకీ వారెవరు అనుకుంటున్నారా..? సినిమా క్లైమాక్స్ ఫైట్ లో ఓ ఆరుగురు వికలాంగులు కనిపిస్తారు. వారు చేసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు కీలకం. విలన్స్ తో వారు చేసే ఫైట్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ లో ఇదొకటి. అయితే సుప్రీమ్ టీం ఈ ఆరుగురు వికలాంగులను ప్రత్యేకంగా అభినందించాలని ఫిక్స్ అయ్యారట. దానికి సుప్రీమ్ సక్సెస్ మీట్ కరెక్ట్ అని భావించి.. కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.