సూర్య హీరోగా విక్రం కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం '24'. మే 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా చిన్న పిల్లలకు బాగా నచ్చడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే రెగ్యులర్ ఫైట్స్, పాటలు కాకుండా కొత్తదనం కోరుకునే ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూస్తోన్న టీం చాలా సంతోషంగా ఉంది. హీరో, ప్రొడ్యూసర్ అయిన సూర్య ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ సినిమాలో లవ్ ట్రాక్, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ సినిమాకు మైనస్ అనే విమర్శలొస్తున్నాయి. వీటిపై స్పందించిన సూర్య వెంటనే సమంత, సూర్య ల మధ్య వచ్చే లవ్ సీన్స్ తో పాటు మరో కొన్ని సీన్స్ కలిపి మొత్తం తొమ్మిది నిమిషాల సన్నివేశాలను ఎడిట్ చేయించాడట. ఈ కొత్త వెర్షన్ ను ఈరోజు మధ్యహ్నం షో నుండి ప్రదర్శిస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందు వరకు సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయలేదు. కాని సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ తో బాగా ప్రమోట్ చేసి క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో 24 టీం ఉంది. అప్పుడే తమిళం, తెలుగులో ప్రమోషన్స్ ను కూడా మొదలెట్టేశారు. ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్నట్లు సమాచారం.