మామ (చిరంజీవి) 150వ సినిమా 150 కోట్లు వసూలు చేయాలని బన్నీ కోరుకున్నారు. తమ ఫ్యామిలీకి తారు రోడ్డు వేసిన మామయ్య పై ఇంతటి అభిమానం ఉండడం అభినందనీయమే. కానీ సాధ్యాసాధ్యాలను బన్నీ పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చిరంజీవి చివరి చిత్రం శంకర్ దాదా జిందాబాద్ వరకు ఒకసారి కెరీర్ పరిశీలిద్దాం. మెగాస్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవి నటించిన ఏ చిత్రం ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రంగా నిలువలేదు. ఎక్కువ కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న రికార్డ్ కూడా ఆయనకు లేదు. అయితే భారీ ఓపనింగ్స్ సాధించిన అనేక చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. మాస్ హీరోగా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడిగా చిరుకు పేరుంది.
మైక్ దొరికిందే తడవు చిరు పాటపాడే బన్నీకి 150 కోట్ల రికార్డ్ ను మామయ్య సాధిస్తాడనే నమ్మకం ఉండడం తప్పుకాదు.
సర్దార్.. వేడుకకు హాజరైన చిరంజీవి ఆ చిత్రం బాహుబలిని క్రాస్ చేయాలని తమ్ముడిని ఆశీర్యదించారు. బాహుబలిది అన్ బీటబుల్ రికార్డ్ అయినప్పటికీ ఆయన ఆశించారు. మరి బన్నీలాంటి కుర్రహీరో మెగాస్టార్ ను కేవలం 150 కోట్లకే పరిమితం చేయడం ఏమిటని అభిమానులు ప్రశ్నిస్తే సమాధానం ఏమిటీ.!?.