బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి కోసం కథానాయిక ఎంపిక పూర్తయిందా? ఆ అవకాశం గోవా బ్యూటీ ఇలియానాకి దక్కిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. బోలెడుమంది కథానాయికల్ని పరిశీలించిన క్రిష్ చివరిగా ఇలియానాని సెట్ చేసినట్టు సమాచారం. అందుబాటులో ఉన్న కథానాయికల్లో ఇలియానా అయితేనే బాలకృష్ణకి తగ్గ జోడీ అనిపించుకొంటుందని భావించిన క్రిష్ ఆమెని సంప్రదించడం, ఓకే అనడం చకచక జరిగిపోయాయట. ఇక చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడడమే ఆలస్యం అని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
చారిత్రాత్మక కథాంశంతో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణిలో కథానాయిక పాత్రకి చాలా ప్రాధాన్యముందట. దానికితోడు బాలకృష్ణలాంటి కథానాయకుడితో కలిసి నటిస్తున్నప్పుడు ఆయన వయసుకు, ఫిజిక్‌కి తగిన హీరోయిన్ అవసరం. అందుకే నయనతార, అనుష్క, కాజల్‌లాంటి సీనియర్ భామల్లో ఒకర్ని ఎంపిక చేసుకోవాలనుకొన్నాడు క్రిష్. కానీ ఆ ముగ్గురు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కాల్షీట్లు సర్దుబాటు చేయలేని పరిస్థితి. ఇక వేరే ప్రత్యామ్నాయం లేక చిత్ర దర్శకుడు ఇలియానాని ఎప్రోచ్ అయ్యాడట. ఇలియానా చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు కాబట్టి ఆమె కూడా సునాయాసంగా ఒప్పుకుందట. అయినా బాలకృష్ణ వందో చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడం కంటే గొప్ప విషయం ఇలియానాకి ఇంకేమైనా వుంటుందా?