మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఈ సినిమా చిత్రీకరణ దశలో మహేష్ కు, డైరెక్టర్ కు మధ్య కొన్ని విభేదాలు వచ్చాయని రకరకాల వార్తలు వచ్చాయి. చెప్పిన కథను శ్రీకాంత్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయట్లేదని మహేష్ అసంతృప్తి చెందాడని, షూటింగ్ కొన్ని రోజులు వాయిదా కూడా వేసారని ఇలా ఒకటా.. రెండా.. సినిమా మొదలుపెట్టినప్పటి నుండి ఏదొక వార్త వస్తూనే ఉంది. తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల నిడివి విషయంలో దర్శకనిర్మాతలు చాలా కేర్ తీసుకుంటున్నారు. డ్యూరేషన్ రెండు గంటల 15 నిమిషాలు దాటకుండా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాలో ఎక్కువ ల్యాగ్ ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ కావట్లేదనే భయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవం టీం కూడా ఇప్పుడు అదే పని చేస్తోంది. ఈ సినిమా నిడివి నిజానికి రెండు గంటల 35 నిమిషాలు. సో.. కథను ట్రిమ్ చేసి వీలైనంత క్రిస్ప్ గా, గ్రిప్పింగ్ ఉండాలని నిర్మాతలు దర్శకుడికి చెప్పినట్లు టాక్. ఫైనల్ గా రెండు గంటల ఇరవై నిమిషాలు మాత్రమే సినిమా నిడివి ఉండాలని ఫిక్స్ అయ్యారట. దీనికోసం సినిమాలో కొన్ని సీన్స్ రెండు పాటలు ఎడిట్ చేయాలని భావిస్తున్నారు. మే 7న సినిమా పాటలను విడుదల చేసి, మే మూడవ వారంలో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.