తెలుగు సంగీత దర్శకుల్లో మిక్కీ.జె.మేయర్‌ది ఒక ప్రత్యేకమైన స్దానం. ఆయన తనకంటూ ఓ స్టైల్‌ను క్రియేట్ చేసుకున్న యువతరం సంగీత దర్శకుడు. మెలోడీ గీతాలను అందించడంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేయకుండా ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించడంలో ఆయన దిట్ట. కాగా కొద్ది రోజుల పాటు టాలీవుడ్‌లో మిక్కి జె.మేయర్ హవా సాగనుంది. ఇటీవలే ఆయన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్-నితిన్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'అ..ఆ' చిత్రం ఆడియో వేడుక జరిగింది. కాగా ఈ నెల 7న ఆయన మహేష్‌బాబు-శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో పివిపి సంస్ధ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆడియో విడుదల కానుంది. కాగా ఈచిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదలకు సిద్దమవుతుండటం, మహేష్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా మిక్కీజెమేయర్ కెరీర్‌కు కీలకంగా మారనుంది. ఇక ఆ తర్వాతి రోజు అంటే మే8న సందీప్ కిషన్, నిత్యామీనన్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ఒక్క అమ్మాయి తప్ప' ఆడియో విడుదల కానుంది. మొత్తానికి ఇకపై కొన్ని రోజలు పాటు మిక్కీ అందిస్తున్న పాటలు శ్రోతలను వీనులవిందుగా అలరించనున్నాయి.