తమిళంలో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి విధ్యులేఖ రామన్. తమిళంలో మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా 'సరైనోడు' లో సాంబార్ సాంబార్ అంటూ అల్లు అర్జున్ వదిన పాత్రలో ప్రేక్షకులను తెగ నవ్వించింది. అలాంటి విధ్యులేఖ పొరపాటున పాస్ పోర్ట్ పోగొట్టుకొని విదేశాల్లో చిక్కుంది. తన స్నేహితులతో విదేశీ పర్యటన కోసం వెళ్ళిన విధ్యులేఖ రామన్ ఓ హోటల్ ఓ రూం తీసుకొని ఉన్నారు. అయితే ఆమె హ్యాండ్ బ్యాగ్ ను ఒక దొంగ ఎత్తుకుపోయాడట. ఆ బ్యాగ్ లో విలువైన పత్రాలతో పాటు, పాస్ పోర్ట్, వీసా, డబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్న విధ్యు తన ట్విట్టర్ ద్వారా మోదీకు, సుష్మా స్వరాజ్ లకు తనకు సహాయం అందించాలని కోరారు. మరి ఈ సమస్యల నుండి విధ్యులేఖ ఎలా బయటపడుతుందో చూడాలి..!