తను కూడా నిర్మాణ భాగస్వామిగా మారిన తర్వాత మహేష్‌లో ఎంతో మార్పు వచ్చింది. అంతకు ముందు తన చిత్రాల ప్రమోషన్, పబ్లిసిటీ గురించి పెద్దగా పట్టించుకోని తాను నిర్మాణ భాగస్వామిగా మారిన తర్వాత ఆయన చేసిన 'శ్రీమంతుడు' చిత్రం ప్రమోషన్, పబ్లిసిటీ విషయంలో మహేష్ చాలా అగ్రెసివ్‌గా మారాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రం విషయంలో కూడా ఆయన మరో అడుగు ముందుకేశాడు. ఈ చిత్రం మే 27న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పాటల వేడుక మే 7న జరుగనుంది. కాగా మే 1వ తేదీ నుంచే ఈ చిత్రం నిర్మాతలు ప్రమోషన్, పబ్లిసిటీ పెంచారు. వెబ్‌సైట్లకు, పత్రికలకు ఆడియోకు సంబంధించిన యాడ్స్ ఇచ్చారు. ఈ ఊపు రోజు రోజుకి పెంచి చిత్రం విడుదలయ్యే వరకు సాగుతుందని చిత్ర యూనిట్ అంటోంది. మే1 నుండి మే 27వరకు తీసుకుంటే దాదాపు నెల రోజుల పాటు ఈ చిత్రం పబ్లిసిటీ, ప్రమోషన్లతో అదిరిపోనుంది. తెలుగు సినిమాలకు సంబంధించి ఇటీవల కాలంలో హయ్యెస్ట్ పబ్లిసిటీ ప్లానింగ్ ఈ 'బ్రహ్మోత్సవం'దే కానుంది.