Advertisement
Google Ads BL

శంకర్‌ కి డబ్బులంటే నీళ్ళే!


శంకర్‌తో సినిమా అంటే నిర్మాతలు ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ముందుగా ఆయన నిర్మాతలకు చెప్పే బడ్జెట్‌కు, వాస్తవానికి ఆయన పెట్టే బడ్జెట్‌కు పొంతన ఉండదు. కాగా ప్రస్తుతం శంకర్‌ రజనీకాంత్‌- అక్షయ్‌కుమార్‌- అమీజాక్సన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'రోబో 2.0' చిత్రం బడ్జెట్‌ రోజురోజుకు పెరిగిపోతోంది. కేవలం ఈ చిత్రం క్లైమాక్స్‌ కోసమే శంకర్‌ 60కోట్లకు పైగా ఖర్చుపెట్టించాడు. ఇటీవల ఈ చిత్రం క్లైమాక్స్‌ సన్నివేశాలను ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో 45రోజలు పాటు చిత్రీకరించాడు. స్టేడియంలో వేసిన సెట్‌కు 22కోట్లు ఖర్చు కాగా, క్లైమాక్స్‌ చిత్రీకరణకు 40కోట్లకు పైగా ఖర్చయిందని సమాచారం. ఇప్పటికి ఈ చిత్రం షూటింగ్‌ కేవలం 30శాతం మాత్రమే జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం బడ్జెట్‌ 100కోట్లు దాటింది. ఆ లెక్కన ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఈ చిత్రం బడ్జెట్‌ 300 నుండి 350కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. అయితే నిర్మాతలు కూడా ఈ చిత్రానికి ఎంత బడ్జెట్‌ కావాలన్నా ఖర్చుపెడతాం. కానీ అవుట్‌పుట్‌ మాత్రం బాగా రావాలని కోరుకుంటున్నారు. నిండ మునిగినోడికి చలేంది చెప్పండి..! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs