Advertisement
Google Ads BL

చంద్రబాబు పెద్ద ప్లానే వేశాడుగా!


చంద్రబాబు రాజకీయ మేథావి. అందులోనూ ఆయన గ్రేట్‌ ట్రబుల్‌ షూటర్‌. అలాగే ఎంతో విజన్‌ ఉన్న నాయకుడు. భవిష్యత్తులో ఏది ఎలా చేయాలి? అనే ఆలోచించగల ఘటనాఘట సమర్ధుడు. కాగా ఆయన ఇటీవల విజయనగరంజిల్లా బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుజయ కృష్ణరంగారావుకు టిడిపి తీర్థం ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన సుజయకు టిడిపి తీర్ధం ఇవ్వడం వెనుక ఎంతో వ్యూహచతురత ఉందని తెలుస్తోంది. సుజయా ప్రస్తుతం వైయస్సార్‌సీపీ శాసనసభా పక్ష కార్యదర్శిగా ఉన్నాడు. దాంతో చంద్రబాబు భారీస్కెచ్‌ వేశాడు. ప్రస్తుతం వైయస్సార్‌సీపీ నుండి నేతలు, ప్రజాప్రతినిదులు వరసగా టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు 13మంది ఎమ్మేల్యేలు టిడిపిలో చేరారు. తాజాగా కర్నూల్‌ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డితోపాటు విశాఖపట్టణం అరకు ఎమ్మేల్యే సర్వేశ్వరరావు, ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఎమ్మేల్యే గొట్టిపాటి రవికుమార్‌లు టిడిపిలో చేరనున్నట్లు సమాచారం. వీరితో పాటు కోణతాల రామకృష్ణ, బాబ్జి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వంటి నాయకులు టిడిపిలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. ఈ విషయాన్ని పక్కనపెడితే మొత్తం 37మంది ఎమ్మేల్యేలు టిడిపిలో చేరితే జగన్‌కు ఉన్న ప్రతిపక్ష హోదా పోతుంది. అందులో భాగంగానే బాబు సుజయను అస్త్రంగా వాడుతున్నాడు. 37మంది వైకాపా ఎమ్మేల్యేలు టిడిపిలో చేరిన పక్షంలో వైయస్సార్‌సీపీ శాసనభాపక్ష కార్యదర్శిగా ఉన్న సుజయ స్పీకర్‌కు తాము అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో సమావేశం కాబోతున్నట్లు లేఖ రాస్తే అది అధికారిక సమావేశం అవుతుంది. ఆ సమావేశంలో జ్యోతుల నెహ్రూను జగన్‌ స్థానంలో వైసీపీ నేతగా ఎన్నుకుంటే సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. జగన్‌ ఈ విషయంపై కోర్టుకి వెళ్లినా కూడా ప్రయోజనం ఉండదు. ఈ సాంకేతిక కారణాలను బేరీజు వేసుకొని చంద్రబాబు భవిష్యత్తులో తమపై విమర్శలు రాకుండా, కోర్టుకు వెళ్లినా ఇబ్బందులు ఎదుర్కోకుండా చంద్రబాబు పెద్ద ప్లానే వేశాడు మరి...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs