Advertisement
Google Ads BL

స్టార్‌హీరోలకు బుడ్డోడి ఝలక్.!


పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో పాటు 'ది జంగిల్‌ బుక్‌' చిత్రం కూడా మన దేశంలో ఉగాది రోజున విడుదలైంది. మొదటి మూడు రోజులూ తెలుగులో పవన్‌ హవానే నడిచినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఈ బుడ్డోడు పవన్‌కు పెద్ద షాక్‌నే ఇచ్చాడు. 'సర్దార్‌' థియేటర్లు ప్రేక్షకులు  లేక వెలవెలబోతుంటే 'జంగిల్‌బుక్‌' మాత్రం హౌస్‌ఫుల్స్‌తో రన్‌ అయింది. ఇక ఇటీవల వచ్చిన షారుక్‌ఖాన్‌ 'ఫ్యాన్‌' చిత్రం కూడా ఈ చిత్రం ధాటికి తట్టుకోలేకపోయింది. కనీసం ఈ సినిమా ప్రభంజనాన్ని పవన్‌ మూడు రోజులైన ఎదుర్కొన్నాడు. కానీ షారుఖ్‌కు మాత్రం మొదటి రోజు నుండే బుడ్డోడు తన ప్రతాపం చూపించాడు. ఈ సినిమా దెబ్బకు షారుఖ్‌ 'ఫ్యాన్‌' కూడా ఎదురునిలవలేకపోయింది. ఈ చిత్రం మూడో వారంలోకి ఎంటర్‌ అయినా  జోరు మాత్రం ఆగలేదు. ఇప్పటికీ హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోంది. ఇటీవల వచ్చిన బన్నీ 'సరైనోడు'కు కూడా ఈ ఎఫెక్ట్‌ బాగానే తగిలింది. ఈ చిత్రం 100కోట్ల క్లబ్‌లో చేరుతుందా? లేదా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ చిత్రం ఇప్పుడు వేగంగా 200కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. 2016వ సంవత్సరంలో ఇప్పటివరకు ఇండియాలో ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా 'ఎయిర్‌లిఫ్ట్‌' ఉంది. ఈ చిత్రం 135కోట్లు వసూలు చేసింది. కాగా ఇప్పటివరకు 'ది జంగిల్‌బుక్‌' ఏకంగా 140కోట్లను క్రాస్‌ చేసి ఈ ఏడాది ఇండియాలో ఎక్కువ వసూలూ చేసిన చిత్రంగా నిలవడం చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs