Advertisement
Google Ads BL

ఖుషి విడుద‌లైన రోజే మొద‌లెట్టారు!


చిత్రసీమ‌లో సెంటిమెంట్లు ఎక్కువ‌. ముహూర్తాలంటూ, అచ్చొచ్చిన రోజులంటూ తెగ హ‌డావుడి చేస్తుంటారు సినీ జ‌నాలు. హీరోలు కూడా ఆ సెంటిమెంట్ల‌ని గ‌ట్టిగానే న‌మ్ముతుంటారు. ఇక ద‌ర్శ‌క‌నిర్మాత‌లైతే స‌రేస‌రి. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లాంటి  ఒకరిద్ద‌రు క‌థానాయ‌కులు మాత్రం ఆ త‌ర‌హా సెంటిమెంట్ల‌ని అస్స‌లు ప‌ట్టించుకోరు. ఆయ‌న ప‌ట్టించుకోరేమో..  కానీ... ఆయ‌న చుట్టూ వుండే మ‌నుషులు మాత్రం ప‌ట్టించుకొంటారు క‌దా! అందుకే ఓ సెంటిమెంటు ప్ర‌కార‌మే ఈ రోజు(ఏప్రిల్ 27) ప‌వ‌న్ కొత్త సినిమా మొద‌లైంది. ఖుషి కాంబినేష‌న్‌లో చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎస్‌.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ఫ్యాక్ష‌న్ నేప‌థ్య‌మున్న ఓ చిత్రంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించ‌బోతున్నాడు. ఖుషి, పులి చిత్రాల త‌ర్వాత వీళ్లిద్ద‌రూ క‌లిసి చేస్తున్న చిత్ర‌మిది. ఈ రోజు ఉద‌యం పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమాని లాంఛ‌నంగా మొద‌లుపెట్టారు. అయితే ఈ రోజు ఖుషి సినిమా విడుద‌లైన రోజు. స‌రిగ్గా ప‌దిహేనేళ్ల క్రితం ఇదే రోజు విడుద‌లైన ఖుషి ఘ‌న విజ‌యం సాధించింది. ప్రేమ‌క‌థ‌ల్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచింది. ఆ కాంబినేష‌న్‌లోనే తెర‌కెక్కుతున్న సినిమా కావ‌డంతో ఆ సినిమా విడుద‌లైన రోజునే కొత్త సినిమా మొద‌లుపెట్టారు. ఇదంతా ద‌ర్శ‌కుడు ఎస్‌.జె.సూర్య‌, నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ప్రోద్భ‌లం మేర‌కే జ‌రిగింద‌ట‌. ప‌వ‌న్‌కి ఇలాంటి సెంటిమెంట్ల‌పై పెద్ద‌గా న‌మ్మ‌కం వుండ‌దు. కానీ ద‌ర్శ‌క‌నిర్మాతలు కోర‌డంతో ఓకే చెప్పాడు.  ఈ సినిమా కోసం శ‌ర‌త్ మ‌రార్ కొత్త ఆఫీసులోకి మారాడ‌ట‌.  మ‌రి ఆ ఆఫీసైనా క‌లిసొస్తుందో లేదో చూడాలి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs