'రోజా','బొంబాయి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన నటుడు అరవింద్ స్వామి. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత 'కడలి' సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. తను విలన్ గా నటించిన 'తని ఒరువన్' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇదే చిత్రాన్ని రామ్ చరణ్ 'ధ్రువ' అనే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. రీమేక్ సినిమాలో కూడా విలన్ పాత్రలో అరవింద్ స్వామీనే నటిస్తున్నాడు. తనకు చాలా ఆఫర్స్ వస్తున్నప్పటికీ.. సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తోన్న ఈ నటుడు త్వరలోనే మెగా ఫోన్ పట్టనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా సినిమాలను డైరెక్ట్ చేసే ఆలోచన ఉందని.. అయితే దానికి సరైన సమయం ఇదే అని అరవింద్ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను రెడీ చేసుకున్నానని.. ఈ సంవత్సరం చివరి నెలల్లో సినిమా మొదలు పెడతానని అన్నారు.